Share
  • పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్ స్వామి

వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (సింగిడి): తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు Free Police Training ఇవ్వనున్నారు. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి. మధుకర్ స్వామి సారథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్, రాంకీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మువ్వ రామిరెడ్డి తెలిపారు.ఈ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీ నుండి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వాట్సాప్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్ లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ లేదా లింక్ ద్వారా సమర్పించవచ్చన్నారు.

అ‘షేమ్’బ్లీ: https://epaper.singidinews.com/clip/1614

Free Police Training దరఖాస్తులకు 17వ తేదీ ఆఖరు..

Free Police Training

Free Police Training దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 9:00 గంటల వరకు అని తెలిపారు.అభ్యర్థుల ఎంపిక కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 పరీక్షా కేంద్రాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్ నగర్,నారాయణపేట,నాగర్ కర్నూల్, వనపర్తి లో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపారు. అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులలో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన 100 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన వసతి తో కూడిన రెసిడెన్షియల్ శిక్షణ, ఉచితంగా డ్రస్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పరీక్ష ఫలితాలు ఈనెల 22 న విడుదల అవుతాయని, సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈనెల 25 వ తేదీ పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ శంషాబాద్ క్యాంపస్ నందు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని చెప్పారు.ఈ శిక్షణ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పోలీసు నియామక ప్రక్రియలోని మెయిన్ పరీక్ష వరకు నిరంతరంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.

వరంగల్ జిల్లా అధ్యక్షునిగా అరవింద్: https://site.singidinews.com/journalism-in-warangal-hanamkonda-committees/

Share