సింగిడి స్పోర్ట్స్: భారత టీ20 సారథిగా యంగ్ సెన్సేషన్ శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉన్నా సారథిగా అయ్యర్ కు ఒక్క విజయం కూడా దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ అభిమానులు ఈ విషయంలో కలవరపడుతుంటే సగటు క్రికెట్ అభిమాని మాత్రం దిగాలు పడుతున్నాడు. వరుసగా టాస్ గెలుస్తున్నా కానీ మ్యాచ్ లు మాత్రం గెలవలేకపోతున్నాడు. పసికూన ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20లు ఓడిపోవడమే కాదు.. ఇంగ్లండ్ తో కూడా రెండు టీ20ల్లో మనోళ్లు తేలిపోయారు. మొదటి టీ20 వర్షం వల్ల రద్దవగా.. రెండు మూడు టీ20ల్లో భారత యువ జట్టు తేలిపోయింది. రెండో టీ20 అయినా పర్లేదు కానీ ఇటీవల జరిగిన మూడో టీ20లో మాత్రం అయ్యర్ సేన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో భారత క్రికెట్ వీరాభిమానులే కాకుండా సగటు అభిమానులు కూడా అయ్యో అని దిగాలు చెందుతున్నారు.

టీ20 చాంపియన్లు వీరేనా!

iyer

భారత జట్టు టీ20 చాంపియన్. అటువంటి చాంపియన్ జట్టు పసికూన ఐర్లాండ్ మీద ఓడిపోవడం గమనార్హం. ఐర్లాండ్ గెలుపు ఏదో గాలివాటం అని అనుకుందామంటే.. తర్వాత ఇంగ్లండ్ తో ఆడిన మూడు టీ20ల్లో ఒకటి వర్షార్పణం కాగా.. మరో రెండు టీ20ల్లో అయ్యర్ సేన ఘోరంగా ఓడిపోయింది. మరి రేపు జరిగే నాలుగో టీ20లో అయినా అయ్యర్ కెప్టెన్ గా గెలుపు బాట పట్టాలని అంతా ఆశిస్తున్నారు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *