Share
  • వనపర్తిలో డెంగ్యూ మరణాలకు జిల్లా అధికారులదే బాధ్యత
  • స్పందించని కలెక్టర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి
  • టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు యంఏ. ఖాదర్ పాష డిమాండ్

వనపర్తి ప్రతినిధి, ఆగస్టు 29 (సింగిడి): వనపర్తి జిల్లాలో డెంగ్యూ, మలేరియా మరణాలకు Wanaparthy Collector, వనపర్తి జిల్లా అధికారులదే పూర్తి బాధ్యత అని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సరిగ్గా 20 రోజుల కిందటే Wanaparthy Collectorను స్వయంగా కలిసి సీజనల్ వ్యాధుల తీవ్రతపై ముందస్తు హెచ్చరికలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించామని, కానీ కలెక్టర్ ఆ వినతిపత్రాన్ని పక్కన పడేసి తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆయన ధ్వజమెత్తారు. అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే నేడు వరుస మరణాలు సంభవిస్తున్నాయని, ఈ పరిస్థితికి జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓలే ప్రత్యక్ష బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.20 రోజుల క్రితం హెచ్చరించినా స్పందించకుండా ఒక్క వార్డులో కూడా పర్యటించని కలెక్టర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం చేతకాకపోతే ఆయనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అన్నారు.

కోదాడ సీఐ ఓవరాక్షన్.. తిరగబడ్డ జనం.. మహిళలపై దాడి చేసిన సీఐ?: https://youtu.be/IJvj494MibE?si=s7PI6-zzE_6Z6AIp

బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

Wanaparthy Collector

అధికారుల నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలపై స్పందించి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసులు, ఇప్పటివరకు సంభవించిన మరణాల వివరాలపై జిల్లా యంత్రాంగం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రతి వార్డులోనూ ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్లేట్‌లెట్లు, బెడ్లు, మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బాధితుల నుంచి లక్షలాది రూపాయలు గుంజుతుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని, దోపిడీకి పాల్పడుతున్న దవాఖానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లా పరిపాలన, ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించకపోతే బాధిత కుటుంబాలు, ప్రజాసంఘాలతో కలిసి కలెక్టరేట్ ముట్టడి, దిగ్బంధన పోరాటం చేపడతామని ఖాదర్ పాష హెచ్చరించారు.

మైనర్ బాలికపై అత్యాచారం… ఎస్సై తీరుపై విమర్శలు: https://site.singidinews.com/minor-sexual-assault-allegations/

Share