Share
  • ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం తరలింపు
  • 1.4 కిలోల గంజాయి స్వాధీనం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో ఆగస్టు 30 (సింగిడి):  గంజాయి అక్రమ రవాణా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో భూపాలపల్లి సిసిఎస్ పోలీసులు, మహాముత్తారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని (Ganja Smuggler) అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం గ్రామానికి చెందిన దానం శశికృష్ణ ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా యామన్ పల్లి సమీపంలోని చెరువు వద్ద ఆటోలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ganja Smuggler

తమిళనాడు గవర్నర్‌గా ఏపీ మాజీ సీఎం:  https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

Ganja Smuggler వద్ద రూ. 70వేల గంజాయి స్వాధీనం

Ganja Smuggler వద్ద నుంచి సుమారు 1 కిలో 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.70 వేలుగా పోలీసులు అంచనా వేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడిపై ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై రమేష్ వివరించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి సేవించడం, విక్రయించడం లేదా అక్రమంగా రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై రమేష్ కోరారు.

సింగిడి సత్తా.. మోరీ క్లీన్ చేసిన వైనం: https://site.singidinews.com/singidi-news-mori-cleaning-public-issue/

Share